బహుజన సేన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలేకు ఘన నివాళి

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ పట్టణంలో జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి – జింక శ్రీధర్ వేములవాడ టౌన్,వీవీ న్యూస్ మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ డివిజన్ కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సామాజిక సేవలు, విద్యా ఉద్యమాలు, సమానత్వ పోరాటాలను నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు,...