వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ,వీవీ న్యూస్ హరిహర క్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 19వ రోజు వేడుకలను ఆలయ ఏఈఓ జయకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా, ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ...