Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థులకు షూ పంపిణీ

విద్యార్థులకు షూ పంపిణీ

  • విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
  • చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సర్పంచ్ ముత్త సంజన మహేష్

వేములవాడ అర్బన్,వీవీ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలోని విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చంద్రగిరి ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు సర్పంచ్ ముత్త సంజన మహేష్ షూలను అందజేశారు. విద్యార్థులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముత్త సంజన మహేష్ మాట్లాడుతూ..విద్యార్థులే గ్రామ భవిష్యత్తు. చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, వారి అవసరాలను గుర్తించి సహకారం అందించడం మనందరి బాధ్యత. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ తరఫున తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, అంగన్‌వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు షూ పంపిణీ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: