Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 31 Oct 2026, 02:14 PM | TELANGANA
అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

  • ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని..సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సేవలపై ఆరా తీశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..కుల,ఆదాయం,నివాసం ఇతర ధృవీకరణ పత్రాల కోసం,రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే అర్జీదారులకు
అందుబాటులో ఉండి.. సేవలు అందించాలని సూచించారు.భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పకడ్బందీగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

అందుబాటులో ఉండి.. సేవలు అందించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: