Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గోల్డ్ మెడల్ సాధించిన గ్రామీణ యువకుడు వినయ్

గోల్డ్ మెడల్ సాధించిన గ్రామీణ యువకుడు వినయ్

  • హర్షం వ్యక్తం చేస్తున్న బంధుమిత్రులు,కుటుంబ సభ్యులు

వేములవాడ రూరల్,వీవీన్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి గ్రామానికి చెందిన బొడ్డు మల్లేశం కుమారుడు బొడ్డు వినయ్ అరుదైన ఘనత సాధించాడు. చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతున్న వినయ్‌కు యూనివర్సిటీ తరఫున గోల్డ్ మెడల్‌తో పాటు డిస్టింక్షన్ లభించాయి.రైతు కుటుంబానికి చెందిన బొడ్డు మల్లేశం కుమారుడు వినయ్ విద్యలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా, తన తండ్రి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.వినయ్ సాధించిన విజయంతో పోచెట్టిపల్లి గ్రామంలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు,ప్రముఖులు వినయ్‌ని అభినందించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: