Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అమెరికాలో నల్లగొండ జిల్లా యువతి మిస్సింగ్

అమెరికాలో నల్లగొండ జిల్లా యువతి మిస్సింగ్

నల్గొండ జిల్లా యువతి అమెరికాలో అదృశ్యం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల కోయ్య శ్రీజ బోస్టన్ నగరంలో కనిపించకుండా పోయారు.నవంబర్ 2వ తేదీ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన శ్రీజ తిరిగి నివాసానికి చేరుకోలేదు.దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో శ్రీజ మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ సమీపంలోని బీచ్ వద్ద నమోదైనట్లు సమాచారం.ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె ఆచూకీపై ఆందోళన నెలకొంది.శ్రీజ అదృశ్యమైన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు.అమెరికా అధికారులతో పాటు తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి శ్రీజ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కోరారు.ప్రస్తుతం బోస్టన్ పోలీసులు బీచ్ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు తమ ఒక్కగానొక్క కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు యాదగిరిరెడ్డి, రూప కన్నీరుమున్నీరవుతున్నారు.

అమెరికాలో నల్లగొండ జిల్లా యువతి మిస్సింగ్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: