Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజావాణి ఫిర్యాదుపై పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 10 Nov 2026, 10:23 PM | TELANGANA
ప్రజావాణి ఫిర్యాదుపై పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

  • మౌలిక వసతుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

కరీంనగర్,వీవీ న్యూస్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదుపై కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డా.అశ్విని తనాజీ వాకాడే మంగళవారం కరీంనగర్‌లోని హుస్సేనిపుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదుపై పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: