Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహణ..

Author
Posted By VEMULAWADA VAARTHA
| 14 Nov 2026, 12:54 PM | TELANGANA, తాజా వార్తలు
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా,వీవీ న్యూస్
జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరి గ్రామంలోని తెట్టెకుంట ప్రాథమిక పాఠశాల ఆవరణలో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిల్లల
హక్కులు,విద్య,ఆరోగ్యం,పోషకాహారం,పరిశుభ్రత, బాలల సంక్షేమం వంటి అంశాలపై చర్చించారు. పిల్లల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని,నేటి బాలలే రేపటి పౌరులని వారి హక్కులను కాపాడుతూ, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం మనందరి బాధ్యతని సర్పంచ్ ముత్త సంజన మహేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు ఎడెల్లి సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి నిట్టు నరేష్, అంగన్వాడీ ఉపాధ్యాయులు పూసాల మల్లీశ్వరి, షాహిని, శంకరవ్వ, ఇమామ్, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహణ.. - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: