Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం

మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ను కలిసిన నూతనంగా నియమితులైన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్‌తో పాటు నూతన పాలకవర్గ సభ్యులు.అనంతరం తొలిసారిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను,జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ను కలిసిన పాలకవర్గ సభ్యులు,మార్కెట్ కమిటీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

.రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు తెలిపారు.రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మార్కెట్ కమిటీని ముందుకు తీసుకెళ్తామని,రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి, రైతులకు అందుబాటులో ఉండేలా సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: