Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజయ్ జాజు

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజయ్ జాజు

  • ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు.
  • రూ.2 లక్షల జీవిత బీమా రూ.5 లక్షలకు పెంపు.
  • నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ

కరీంనగర్,వీవీ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలుపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు అమలవుతున్న బీమా పథకాలను ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నేతన్నలు, గౌడులు, కార్మికులు, మత్స్యకారులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావడం ద్వారా రూ.5 లక్షలకు పెంచనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్హ కుటుంబంలోని సభ్యులందరూ పథకంలో నమోదు చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించాలని సూచించారు. పథకం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. దాదాపు నెల రోజుల పాటు కొనసాగనున్న నమోదు ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజయ్ జాజు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: