Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • మల్యాల,వీవీ న్యూస్
  • కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
  • ఘన స్వాగతం పలికిన అర్చకులు,ఆలయ అధికారులు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి చందనోత్సవం, పుష్ప సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముందుగా ఆలయానికి చేరుకోవడంతో అర్చకులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

కొండగట్టు అంజన్న సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: