Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిళలు ఆర్థికంగా ఎదగాలి – డాక్టర్ చెన్నమనేని దీప వికాస్

మహిళలు ఆర్థికంగా ఎదగాలి – డాక్టర్ చెన్నమనేని దీప వికాస్

  • స్వయం ఉపాధికి నైపుణ్య శిక్షణే పునాది
  • చంద్రగిరిలో ఉచిత కుట్టుశిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ
  • వృత్తి నైపుణ్యాలతోనే స్వయం ఉపాధి – సర్పంచ్ ముత్త సంజన మహేష్

వేములవాడ అర్బన్,వీవీన్యూస్
మహిళలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని డాక్టర్ చెన్నమనేని దీప వికాస్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంలో 60 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని దీప, డాక్టర్ చెన్నమనేని వికాస్ ముఖ్య అతిథులుగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమకు అందుబాటులో ఉన్న శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందుతూ కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఏసీ టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్, బ్యాంకింగ్ కోర్సులతో పాటు మహిళలకు టైలరింగ్, ఫ్రంట్ ఆఫీస్, హోమ్ హెల్త్ ఎయిడ్, ఇయర్‌బడ్ తయారీ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. యువతీ యువకులు, మహిళల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలి. కుట్టుశిక్షణ వంటి కార్యక్రమాలు మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయి. గ్రామంలోని మహిళల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు.

మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు, గ్రామ సంఘం అధ్యక్షులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రతిమ ఫౌండేషన్, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: