Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పేద విద్యార్థిని వైద్య విద్యకు వికాస్‌రావు అండ

Author
Posted By VEMULAWADA VAARTHA
| 25 Oct 2026, 02:43 PM | TELANGANA
పేద విద్యార్థిని వైద్య విద్యకు వికాస్‌రావు అండ

  • ప్రతిమ ఫౌండేషన్ ద్వారా రూ.45 వేల ఆర్థిక సాయం

వేములవాడ గ్రామీణం,వీవీన్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన బీడీఎస్ విద్యార్థిని పూడూరి గ్లోరికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు ఆదివారం ప్రతిమ ఫౌండేషన్ ద్వారా రూ.45 వేల ఆర్థిక సాయం అందించారు.పేద కుటుంబానికి చెందిన గ్లోరి నీట్‌లో అర్హత సాధించి, ఖమ్మంలోని ఓ కళాశాలలో బీడీఎస్ కోర్సులో సీటు సంపాదించింది. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు అవసరమైన ఖర్చులను భరించలేకపోతున్న విషయాన్ని తెలుసుకున్న వికాస్‌రావు,హన్మాజీపేట గ్రామానికి వెళ్లి ఆమెకు రూ.45 వేల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా గ్లోరి ఉన్నత చదువులు పూర్తి చేసి, మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని వికాస్‌రావు ఆకాంక్షించారు. ఆర్థిక సాయం అందించిన వికాస్‌రావుకు గ్లోరి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంకె మధు, బీజేపీ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: