Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది

Author
Posted By VEMULAWADA VAARTHA
| 29 Oct 2026, 06:35 PM | TELANGANA, రాజన్న సిరిసిల్ల
ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది

  • అనుపురం గ్రామంలో సాగుభూమి సంరక్షణ కార్యక్రమంలో బాగంగా రైతులకి అవగాహన
  • ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సాగుపై అప్రమత్తత విధి విధానాలు

రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్
వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం..రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోటు, భూగర్భ జలాలు మరియు సాగునీటి లభ్యతపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో రైతులు యాసంగి పంటల సాగుపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అని సూచించారు..ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని,ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగుపై పునరాలోచన చేయాలని సూచించారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా సాగు విరామం (క్రాప్ హాలిడే) పాటించే అంశాన్ని పరిశీలించాలని, తద్వారా పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు స్వల్పకాలిక పంటల సూచించారు.

ఇవి కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది - Additional Image

వర్షపాతం, భూగర్భ జలాలు, ప్రాజెక్టులు మరియు చెరువుల్లో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకొని పంటల ఎంపిక చేసుకోవాలని, రైతులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుడదని సూచించారు.
రైతులు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో భాగంగా అనుపురం గ్రామ సర్పంచ్ చెర్ల రాజేశ్వరి మల్లేశం,ఉపసర్పంచ్ వనపట్ల ప్రభాకర్ రెడ్డి వార్డ్ సబ్యులు,వేములవాడ రూరల్ మండల వ్యవసాయ అధికారి వినీత,ఏఈఓ అనూష ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్, మిషన్ భగీరథ ఏఈ రాణి,గ్రామ రైతులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: