Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలి

Author
Posted By VEMULAWADA VAARTHA
| 31 Oct 2026, 02:19 PM | TELANGANA
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలి

  • ఐడీఓసీలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు.భారత తొలి ఉప ప్రధాని, మాజీ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్,జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ..సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఉద్యోగులు, సిబ్బంది ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ..వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి పటేల్ అని కొనియాడారు.కార్యక్రమంలో ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: