Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేయూత

Author
Posted By VEMULAWADA VAARTHA
| 01 Nov 2026, 04:02 PM | Bhakti, HEALTH, TELANGANA
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేయూత

  • భరోసాగా నిలిచిన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు

రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు, నిరుద్యోగ యువత,మహిళలు,వృద్ధులకు విద్య,వైద్యం, ఆర్థిక సహాయం అందించడమే పరమావధిగా ‘సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి’ కృషి చేస్తోందని ప్రముఖులు పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు పేద వ్యక్తులకు స్వయం ఉపాధి కల్పించేందుకు అరటి పండ్ల బండ్లను వితరణగా అందజేశారు.జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్న రాజు,రమణారెడ్డి అనే ఇద్దరు పేదలకు అరటి పండ్లు అమ్ముకుని కుటుంబాలను పోషించుకునేందుకు వీలుగా పండ్ల బండ్లను కొనుగోలు చేసి,ఆర్థిక సహాయంతో పాటు సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైశ్య భవన్ అధ్యక్షుడు కటకం సత్తయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్ మాట్లాడుతూ,సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని,కష్టాల్లో ఉన్న తోటి వారికి అండగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. పేదలకు స్వయం ఉపాధి కల్పించిన నిర్వాహకుల చొరవను అభినందించారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ (వీహెచ్‌పీ)విశ్వహిందూ పరిషత్ పట్టణ కార్యదర్శి గుంటుక పురుషోత్తం, భాజపా నాయకులు నాగుల శ్రీనివాస్,మామిడాల కృష్ణ,సమితి అధ్యక్షుడు బద్దేపురి దేవేందర్,ప్రధాన కార్యదర్శి శ్రీపతి సత్యనారాయణ,ఉపాధ్యక్షుడు సిరిమల్లె శ్రీహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బూర శ్రీనివాస్,స్థానిక ప్రజలు,తదితరులు ఉన్నారు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేయూత - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: