Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి

Author
Posted By VEMULAWADA VAARTHA
| 02 Nov 2026, 04:21 PM | Sports, TELANGANA
క్రికెట్ లో ఉత్తమ ప్రతిభ చూపాలి

  • ఉన్నత స్థానాలకు ఎదగాలి.
  • జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
  • యువ క్రికెట్ క్రీడాకారిణికి క్రికెట్ కిట్, సామగ్రి అందించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్
క్రికెట్ పోటీల్లో గూడెపు వంశిక ఉత్తమ ప్రతిభ చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ఈ నెల 12 వ తేదీ నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయిలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్లో రాష్ట్రం తరఫున జిల్లా నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన గూడెపు వంశిక పాల్గొననున్నది. ఆ క్రీడాకారిణికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పోర్ట్స్ కిట్, సామగ్రి అందజేసి.. అభినందించారు. నిత్యం సాధన చేయాలని, మంచి ప్రతిభ చూపి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాసు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: