Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Author
Posted By VEMULAWADA VAARTHA
| 04 Nov 2026, 06:00 PM | TELANGANA
కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కోనరావుపేట,వీవీ న్యూస్
కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న బీమా, పెన్షన్ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా కనగర్తి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ భూక్య పడావ్ సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం బ్యాంక్ ఖాతాదారులు, గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలు సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలలో చేరి భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందాలని సూచించారు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తున్న గోల్డ్ లోన్ సేవలను, ఇతర బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరారు. బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్న అనూష అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రజిత,వార్డు సభ్యులు మొకెనపెళ్లి బాలరాజు,చిద్రవేణి నరేష్, బ్యాంక్ మిత్ర చిద్రవేణి వెంకటేష్,బ్యాంకు సిబ్బంది,ఖాతాదారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: