Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నాడు మాటిచ్చాడు...నేడు నిలబెట్టుకున్నాడు

Author
Posted By VEMULAWADA VAARTHA
| 06 Nov 2026, 10:56 AM | TELANGANA
నాడు మాటిచ్చాడు...నేడు నిలబెట్టుకున్నాడు

  • ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్న ఆరేపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు.
  • నాడు మాటిచ్చాడు...నేడు నిలబెట్టుకున్నాడు
  • ఆరేపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు.
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు

వేములవాడ అర్బన్,వీవీ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇటిక్యాల రాజు సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చారు.ఉపసర్పంచ్ సిలివేని ప్రశాంత్ కు కుమార్తె పుట్టడంతో రూ.10,016/- అందించారు. ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గం సభ్యులు,గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను సర్పంచ్ ముందుకెళ్తున్నాడని ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నానని మీడియాకు తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఆడబిడ్డ పుడితే రూ.10,016/- ఇస్తానని హామీ ఇచ్చానని, ఇప్పుడు గ్రామ ఉపసర్పంచుకు కుమార్తె పుట్టడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం సభ్యుల సమక్షంలో డబ్బును అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు,ప్రజలు ఉన్నారు.

నాడు మాటిచ్చాడు...నేడు నిలబెట్టుకున్నాడు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: