Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొడుకును బతికించుకునేందుకు తల్లి ఆరాటం

Author
Posted By VEMULAWADA VAARTHA
| 06 Nov 2026, 07:12 PM | TELANGANA
కొడుకును బతికించుకునేందుకు తల్లి ఆరాటం

  • పలు ఇండ్లలో రోజు వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మర్రిపల్లి అమృత..బాధితుని తల్లి ఆవేదన అంత ఇంత కాదు.

కొడుకును బతికించుకునేందుకు తల్లి ఆరాటం - Additional Image

వేములవాడ టౌన్, వీవీ ప్ర

ఇవి కూడా చదవండి

జన్న

వేములవాడ టౌన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ లో శుక్రవారం హృదయవిదారక ఘటన జరిగింది.చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్నారు.తన కుమారుడు రాకేష్ వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. కిరాయి చెల్లించలేని పరిస్థితిలో బతికుండగానే కుమారుడితో కలిసి శ్మశానవాటికలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని అమృత వేడుకుంటున్నారు.


వేములవాడలో అద్దె చెల్లించలేక అనారోగ్యంతో ఉన్న కుమారుడితో కలిసి శ్మశానవాటికలో ఆశ్రయం పొందిన అమృత విషయం తెలుసుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆయన సూచనల మేరకు మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేశ్ వేములవాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతున్న రాకేష్ ను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: