Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి ఆపన్న హస్తం

Author
Posted By VEMULAWADA VAARTHA
| 07 Nov 2026, 06:38 PM | HEALTH, Politics, TELANGANA, ఆరోగ్యం
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి ఆపన్న హస్తం

  • అమృతకు బండి ఆపన్న హస్తం
  • తక్షణ సాయంగా రూ.50 వేలు పంపిన కేంద్ర మంత్రి.
  • తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయండి.
  • సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కోరిన బండి సంజయ్.
  • ఇల్లు మంజూరయ్యాక కుటుంబానికి అవసరమైన సరుకులన్నీ ఇవ్వండి.

సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా రూ.50 వేలు పంపారు. ఈ నగదు మొత్తాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ద్వారా బాధితురాలకు అందజేశారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో కేంద్ర మంత్రి ఫోన్లో మాట్లాడుతూ అమృత దుస్థితిని వివరించారు. అమృతకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన కొడుకుతో కలిసి శ్మశానంలో నివసిస్తూ పుట్టెడు దుఃఖంలో ఉన్న అమృతకు అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైన వెంటనే ఆ ఇంటికి అవసరమైన సామాగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: