Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మానసిక దివ్యాంగుల, వికలాంగుల విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణ

Author
Posted By VEMULAWADA VAARTHA
| 11 Nov 2026, 03:15 PM | HEALTH, TELANGANA
మానసిక దివ్యాంగుల, వికలాంగుల విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాల మేరకు, మానసిక దివ్యాంగుల, వికలాంగుల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని కోనరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో మానసిక దివ్యాంగులైన విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి, వారి శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సైకాలజిస్ట్ డాక్టర్ అనూష విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి, అవసరమైన కౌన్సెలింగ్, సూచనలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ, మానసిక దివ్యాంగులైన పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులలో గుర్తించిన ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించడంతో పాటు,వారి ఆరోగ్య పరిరక్షణకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి కాశీరామ్ ఎంపీడీవో స్నిగ్ధ రెడ్డి,చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటరమణ, సైకాలజిస్ట్ డాక్టర్ అనూష,ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ రామకృష్ణ,డాక్టర్ సంపత్ కుమార్, వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: