Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు! పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఘాటు హెచ్చరిక

రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు!  పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఘాటు హెచ్చరిక

వేములవాడ వార్త ఉమ్మడి నల్లగొండ జిల్లా..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. కోమటిరెడ్డి సోదరుల రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, పార్టీకి చేసిన సేవలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. సీనియర్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని, ఎవరెవరి స్థాయులు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు.శుక్రవారం శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దైద రవీందర్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు పున్న కైలాష్‌కు లేదన్నారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులపై విమర్శలు చేయడం మానుకోవాలని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.డీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను విస్మరించి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు. కేవలం ప్రెస్‌మీట్లు నిర్వహించడం వల్ల పార్టీ బలోపేతం కాదని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. పార్టీ సీనియర్ నాయకులకు తగిన గౌరవం, ప్రోటోకాల్ కల్పించాలని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని దైద రవీందర్ డిమాండ్ చేశారు.1989 నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాం.. సీనియర్ల స్థాయిని తెలుసుకొని మాట్లాడాలి నిన్న మొన్న వచ్చిన వారు కోమటిరెడ్డి సోదరులపై విమర్శలు చేయడం తగదు,ఈ కార్యక్రమంలో పాత కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు!  పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఘాటు హెచ్చరిక - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: