Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తాం.. వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తాం.. వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరిక

  • వేములవాడ టౌన్,వీవీ న్యూస్
  • మాడిఫైడ్ సైలెన్సర్లు, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు,కార్లకు కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ సైలెన్సర్లను తొలగించి,అధిక శబ్దం వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడంతో పాటు అతివేగంగా,నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల ప్రజలు,వృద్ధులు,చిన్నపిల్లలు,ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలకు కూడా అతివేగం కారణమవుతోందని తెలిపారు.

టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చిన వాహనాలతో పాటు అతివేగంగా వాహనాలు నడిపే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా 18 ఏళ్లలోపు మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులైన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతో పాటు భారీ జరిమానాలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు.తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, వాహనాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ధ్వని కాలుష్య నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ప్రజల భద్రత దృష్ట్యా వాహనదారులందరూ పోలీసులకు సహకరించాలని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: