Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

  • ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.
  • ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు.. వ్యాన్ సీజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట బధనకల్ గ్రామాల శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గారు మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈసందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను, రహదారి పరిస్థితులను, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి,వ్యాన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, విచారణను వేగవంతం చేసి పూర్తి నివేదిక సమర్పించాలని డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను ఆదేశించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు.పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ వాహన వేగాన్ని తగ్గించి, ముందు వెళ్తున్న వాహనాలకు సురక్షిత దూరం పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని తెలిపారు.ఈ పరిశీలనలో ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ జ్యోతి మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: