Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్తీక పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయం వద్ద తాటికొండ శ్రీనివాస్ అన్నదానం

కార్తీక పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయం వద్ద తాటికొండ శ్రీనివాస్ అన్నదానం

  • రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ సమీపంలోని దత్తాత్రేయ ఆలయం వద్ద తాటికొండ శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని భక్తి భావంతో నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ ముందుగా పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని,కార్తీక పౌర్ణమికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అన్నదానం మహాదానమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని ప్రతి పౌర్ణమికి భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు,ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావం,ఆధ్యాత్మిక చింతనను భక్తి భావాన్ని పెంపొందిస్తాయని వారన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్,కొక్కుల బాలకృష్ణ,కో ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్,నిర్వాహకులు దాస్,విజయ్ భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయం వద్ద తాటికొండ శ్రీనివాస్ అన్నదానం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: