Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి' డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 25 Nov 2026, 05:02 PM | HEALTH, TELANGANA, తెలంగాణ
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి' డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్య సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పీఎస్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (UPHC) ఆమె సందర్శించి వైద్య సేవలు, రిజిస్టర్లు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై తల్లిదండ్రులు, బాలికలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన బాలికలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలోని అమృత చిల్డ్రన్ హాస్పిటల్‌ను సందర్శించి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్–2010 ప్రకారం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న రికార్డులు, ఇతర అంశాలను పరిశీలించారు. చట్టంలోని నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు.ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాహితి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి' డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: