Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ వస్తువుల పంపిణీ

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ వస్తువుల పంపిణీ

  • బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కార్యక్రమం

కోనరావుపేట,వీవీ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను పంపిణీ చేశారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే కార్మికుల ఆరోగ్యం, భద్రత పట్ల శ్రద్ధ చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, నక్క ఎల్లయ్య, వార్డు సభ్యులు పాల్గొని పారిశుధ్య కార్మికులకు వస్తువులను అందజేశారు.

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ వస్తువుల పంపిణీ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: