Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కరీంనగర్‌లో క్లాసిక్ అభిరుచి రెస్టారెంట్ లైసెన్స్ తక్షణమే సస్పెన్షన్

కరీంనగర్‌లో క్లాసిక్ అభిరుచి రెస్టారెంట్ లైసెన్స్ తక్షణమే సస్పెన్షన్

  • అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్య

కరీంనగర్,వీవీ న్యూస్
కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని క్లాసిక్ అభిరుచి మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఆహార తయారీ, నిల్వ, పరిశుభ్రతకు సంబంధించి పలు తీవ్రమైన లోపాలు గుర్తించడంతో రెస్టారెంట్ FSSAI లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.తనిఖీల్లో పచ్చి గుడ్లతో మయోనైజ్ తయారీ, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్లు, ఫుడ్ కలర్స్ వినియోగం, ఫంగస్ పట్టిన నిమ్మకాయలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో మాంసం నిల్వ చేయడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సుమారు 30 కిలోల ఆహార, మాంసం పదార్థాలను సరైన లేబులింగ్ లేకుండా నిల్వ చేసినట్లు వెల్లడించారు. వంటగదిలో అపరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలు, ఫుడ్ హ్యాండ్లర్లు గ్లౌజులు, హెడ్ క్యాప్స్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలు కూడా గుర్తించారు.

ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా ఉన్న ఈ లోపాల నేపథ్యంలో FSSAI స్టేట్ లైసెన్స్ నంబర్ 13621002000175ను సస్పెండ్ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం వెల్లడించింది.లైసెన్స్ సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం రెస్టారెంట్‌లో ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాలు, పంపిణీ, వడ్డింపు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. గుర్తించిన లోపాలను సరిచేసినప్పటికీ, సంబంధిత సమర్థ అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి వచ్చిన తర్వాతే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.ఈ వివరాలను కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించింది.

కరీంనగర్‌లో క్లాసిక్ అభిరుచి రెస్టారెంట్ లైసెన్స్ తక్షణమే సస్పెన్షన్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: