Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అన్నదాతగా నిలిచిన ఆరేపల్లి సర్పంచ్ రాజు నవీన దంపతులు

అన్నదాతగా నిలిచిన ఆరేపల్లి సర్పంచ్ రాజు నవీన దంపతులు

  • ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ

వేములవాడ రూరల్,వీవీ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ వారం కూడా భక్తిశ్రద్ధలతో కొనసాగింది.శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈరోజు అన్నప్రసాద వితరణకు ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇటిక్యాల రాజు నవీన దంపతులు దాతలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతల కుటుంబాలపై శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతగా నిలిచిన ఆరేపల్లి సర్పంచ్ రాజు నవీన దంపతులు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: