Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

  • వేములవాడ,వీవీ న్యూస్

హరిహర క్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 19వ రోజు వేడుకలను ఆలయ ఏఈఓ జయకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా, ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు, సేవాసమితి సభ్యులకు ఆలయ అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, వాయనంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.ఈ వేడుకల్లో ఆలయ పర్యవేక్షకులు నూగురి నరేందర్, వేద పండితులు,అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: