Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జన గణన సమాచారం పక్కాగా సేకరించాలి: ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 22 Oct 2026, 05:54 PM | TELANGANA
జన గణన సమాచారం పక్కాగా సేకరించాలి: ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

  • రెండో దశ జనాభా గణనపై ఛార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు ఐడీఓసీలో శిక్షణ

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
జన గణన సమాచారం క్షేత్రస్థాయిలో నాణ్యతతో పక్కాగా సేకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.భారత జనగణన–2027లో భాగంగా రెండో దశ జనాభా గణన (Population Enumeration) నిర్వహణపై ఛార్జ్ ఆఫీసర్ల(తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లు ఎంపీడీఓల)కు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.జనాభా గణన రెండో దశను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో గణన ప్రక్రియ అమలు, గణన సిబ్బంది విధులు, బాధ్యతలు, జనాభాకు సంబంధించిన వివరాల కచ్చితమైన సేకరణ, సమాచార నమోదు, సంబంధిత మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు.

ఇవి కూడా చదవండి

జన గణన సమాచారం పక్కాగా సేకరించాలి: ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Additional Image

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించి .. హౌస్ లిస్టింగ్ బ్లాక్ ల ఆధునీకరణ పూర్తి చేయాలని సూచించారు. 800 కంటే జనాభా ఎక్కువ ఉంటే నూతన ఎన్యూమరేషన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.జనాభా గణన అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ కార్యక్రమమని, ఈ ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సంబంధించిన 40 ప్రశ్నలతో కూడిన వివరాలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులు తమ పరిధిలోని గణన సిబ్బందికి అవసరమైన సూచనలు అందిస్తూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, జనగణన–2027 రెండో దశ జనాభా గణనను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి,ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ,జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: