Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఫాజుల్ నగర్‌లో బీజేపీ టిఫిన్ బైఠక్ కార్యక్రమం

ఫాజుల్ నగర్‌లో బీజేపీ టిఫిన్ బైఠక్ కార్యక్రమం

  • తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి: జక్కుల తిరుపతి
  • నవంబర్ 5న బండి సంజయ్ నిర్వహించే జెన్ జెడ్ యువత ర్యాలీని విజయవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ వేములవాడ రూరల్ మండలం వట్టెంల శక్తి కేంద్రం పరిధిలోని ఫాజుల్ నగర్ గ్రామంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయడంపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కౌన్సిల్ సభ్యుడు జక్కుల తిరుపతి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

వచ్చే నెల నవంబర్ 5వ తేదీన బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జెన్ జెడ్ యువత ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వేములవాడ రూరల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా యువత ముందుకు రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వట్టెంల,ఫాజుల్ నగర్ గ్రామాల బీజేపీ నాయకులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జి నాదగిరి రాహుల్ గౌడ్, ఉపసర్పంచ్ పోగుల రాకేష్, బాగోజు అరుణ్, మంద రాజేందర్, చిందం కుమార్, వార్డు సభ్యులు ఎగుర్ల రాజు, మారుతి, హరీష్, కుమారస్వామి, మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: