Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులు,సిబ్బందికి ఐడీఓసీలో శిక్షణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులు,సిబ్బందికి ఐడీఓసీలో శిక్షణ

  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు
  • 18 నుంచి 59 ఏళ్ల వారు అర్హులు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై జిల్లాలోని ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ అధికారులు,మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు ఇతర అధికారులకు సిబ్బందికి జిల్లా సమీకృత కార్యాలయం ఆడిటోరియంలో బుధవారం ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నదని వెల్లడించారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో విడతల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్జీదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బీమా చేయించేవారు నామిని వారి వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ నామినీలు కూడా ఉండవచ్చని వెల్లడించారు. దరఖాస్తు ఫారంలో సంతకం చేయాలని సూచించారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో అధికారులు,సిబ్బంది ప్రత్యేక శిబిరాల వద్ద టెంట్లు, కుర్చీలు, బీమా వివరాల ప్లెక్సీలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివరాల నమోదు కోసం కంప్యూటర్లు, ఇతర యంత్రాలు, సిబ్బంది హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శిబిరాలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీర భద్రయ్య, జిల్లా ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులు,సిబ్బందికి ఐడీఓసీలో శిక్షణ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: