Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి – టీఆర్‌వీకే కోఆర్డినేటర్లు

Author
Posted By VEMULAWADA VAARTHA
| 29 Oct 2026, 05:39 PM | TELANGANA
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి – టీఆర్‌వీకే కోఆర్డినేటర్లు

  • ఎల్ నినో ప్రభావం.. నీటి పొదుపుపై రైతులకు అవగాహన

బోయినపల్లి,వీవీన్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం ‘ఎల్ నినో ప్రభావం – నీటి పొదుపు’ అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు, టీఆర్‌వీకే (TRVK) కోఆర్డినేటర్లు డాక్టర్ ఆర్. సాయి కుమార్ (వేములవాడ), పి.మధుకర్ రావు (కరీంనగర్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటల సాగులో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం వ్యవసాయ విద్యార్థులు గ్రామంలో నీటి సంరక్షణ, పంటల మార్పిడి ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ గోడలపై నినాదాలు రాశారు. రైతులకు నీటి పొదుపు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా హాజరైన రైతులందరితో నీటిని వృథా చేయకుండా సంరక్షిస్తామని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.గ్రామ సర్పంచ్, పాలకవర్గం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెంకటేష్,రైతులు,వ్యవసాయ విద్యార్థులు సాయి చందన, కిరణ్, నివేదిత, వర్షిణి, నిరంజన తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి – టీఆర్‌వీకే కోఆర్డినేటర్లు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: