Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Author
Posted By VEMULAWADA VAARTHA
| 29 Oct 2026, 06:44 PM | TELANGANA, తాజా వార్తలు
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

  • చందుర్తి మండలం మూడపెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనుల పరిశీలన

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.చందుర్తి మండలం మూడపెల్లిలో టీ జీ ఈ డబ్ల్యూ ఐ డీ సీ ఆద్వర్యంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనులు కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.ఆవరణలో నిర్మాణ పనులు కొనసాగుతుండగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అధికారులు ప్రణాళిక ప్రకారం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామకృష్ణ, తహసీల్దార్ భూపతి, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: