Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*అభిమానాన్ని చాటుకున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు

Author
Posted By VEMULAWADA VAARTHA
| 08 Nov 2026, 06:24 PM | Bhakti, TELANGANA
*అభిమానాన్ని చాటుకున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు

  • లబ్ధిదారులు తిప్పారపు సత్తమ్మ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సొంతింటి కల నెరవేరడంతో ఆనందం.. ఆ కలను సాకారం చేసిన ప్రభుత్వంపై కృతజ్ఞతాభావం.. వెరసి కాంగ్రెస్ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు తిప్పారపు సత్తమ్మ తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుని, ఆ ఇంటి గేటుపై కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును ఏర్పాటు చేశారు. తమ సొంతింటి కల సాకారమైన ఆనందంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు...

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం అనే నినాదానికి తమ ఇల్లు ఒక నిదర్శనమని లబ్ధిదారు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన తమకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత గూడు లభించిందని, తమ కుటుంబానికి భరోసా కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా తమ సొంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఈ అభిమానం.. ప్రజల ఆశలను నెరవేర్చిన సంక్షేమ పాలనకు, తమ జీవితాల్లో వచ్చిన మార్పుకు వారు వ్యక్తం చేస్తున్న కృతజ్ఞతకు ప్రతిబింబంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

*అభిమానాన్ని చాటుకున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: