Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎం సభకు భారీగా జన సమీకరణ

Author
Posted By VEMULAWADA VAARTHA
| 10 Nov 2026, 10:02 PM | Politics, TELANGANA
సీఎం సభకు భారీగా జన సమీకరణ

  • సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు,ఎమ్మెల్యేలు

ఈ నెల19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులు పిలుపునిచ్చారు.సభా ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి,పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సిద్దిపేట బహిరంగ సభ వేదికగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరా భీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, బ్రేక్‌ఫాస్ట్ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటా ఇందిరా కుటుంబం' పథకంతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు సిద్దిపేటకు సమీపంలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిరిసిల్ల, మానకొండూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సభకు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: