Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హిత చింతక్ అభియాన్‌లో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి

Author
Posted By VEMULAWADA VAARTHA
| 21 Nov 2026, 07:49 PM | TELANGANA, తెలంగాణ
హిత చింతక్ అభియాన్‌లో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి

  • వేములవాడలో రేపటి నుంచి ఇంటింటికీ సభ్యత్వ నమోదు

హిందూ ఐక్యత, ధర్మ రక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న హిత చింతక్ అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని నాయకులు గజం రాజు పిలుపునిచ్చారు.

శనివారం వేములవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నవంబర్ 22, ఆదివారం నుంచి వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ హిత చింతక్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. హిందూ సమాజంలో ధార్మిక, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

హిత చింతక్ అభియాన్‌లో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి - Additional Image

యువత, మహిళలు, మేధావులు, వ్యాపారులు, ఉద్యోగులు, ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హిత చింతక్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు కోసం కార్యకర్తలు ఇంటింటికీ వచ్చినప్పుడు ప్రజలందరూ సానుకూలంగా స్పందించి సహకరించాలని, ఈ అభియాన్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో గడప కిషోర్ రావు, నాగుల రాము, గన్నమనేని ప్రదీప్ రావు, పల్లె శ్యాంసుందర్ రెడ్డి, గుండోజు గోపాల్, సనుగుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: