Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా రేగుల శ్రీకాంత్

బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా రేగుల శ్రీకాంత్

  • వేములవాడ,వీవీ న్యూస్

క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే రేగుల శ్రీకాంత్‌కు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా మంగళవారం బాధ్యతలు అప్పగించింది.వేములవాడ పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం ప్రారంభించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఎదిగిన శ్రీకాంత్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దుబాయ్‌లో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన, ఉద్యోగ జీవితాన్ని వదిలి సమాజ సేవ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా పనిచేయడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించింది.
ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ..రేగుల శ్రీకాంత్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి,రాష్ట్ర అధికార ప్రతినిధి,వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావు సహకారంతో నియామకమయ్యారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: