Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్

  • ఇప్పటికే అమృతకు ఆర్ధిక సాయం అందించిన కేంద్ర మంత్రి
  • నిత్యావసర సరుకులతోపాటు అమృతకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆదేశం

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు ఇల్లు మంజూరైంది. అమృతకు దీన స్థితికి చలించిపోయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా ఇటీవల రూ.50 వేలు పంపారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ కి ఫోన్ చేసి అమృతకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. బండి సంజయ్ సూచనతో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఈరోజు అమృతను పిలిచి ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన కొడుకుతో కలిసి శ్మశానంలో నివసిస్తూ పుట్టెడు దుఃఖంలో ఉన్న అమృతకు అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైన వెంటనే ఆ ఇంటికి అవసరమైన సామాగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని కోరారు.

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: