Home

వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ,వీవీ న్యూస్ హరిహర క్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 19వ రోజు వేడుకలను ఆలయ ఏఈఓ జయకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా, ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి...

పూలే సిద్ధాంతాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

కొత్తపల్లి,వీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మోదుంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. సమానత్వం, విద్య,...

బహుజన సేన ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలేకు ఘన నివాళి

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ పట్టణంలో జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి – జింక శ్రీధర్ వేములవాడ టౌన్,వీవీ న్యూస్ మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ డివిజన్ కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చేసిన సామాజిక సేవలు, విద్యా ఉద్యమాలు, సమానత్వ పోరాటాలను నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో బహుజన సేన...

అన్నదాతగా నిలిచిన ఆరేపల్లి సర్పంచ్ రాజు నవీన దంపతులు

ముఖ్యమైన పాయింట్స్:ఎదురుగట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ వేములవాడ రూరల్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ వారం కూడా భక్తిశ్రద్ధలతో కొనసాగింది.శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈరోజు అన్నప్రసాద వితరణకు ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇటిక్యాల రాజు నవీన దంపతులు దాతలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు,...

కరీంనగర్‌లో క్లాసిక్ అభిరుచి రెస్టారెంట్ లైసెన్స్ తక్షణమే సస్పెన్షన్

ముఖ్యమైన పాయింట్స్:అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్య కరీంనగర్,వీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని క్లాసిక్ అభిరుచి మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఆహార తయారీ, నిల్వ, పరిశుభ్రతకు సంబంధించి పలు తీవ్రమైన లోపాలు గుర్తించడంతో రెస్టారెంట్ FSSAI లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.తనిఖీల్లో పచ్చి గుడ్లతో మయోనైజ్ తయారీ, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్లు, ఫుడ్ కలర్స్ వినియోగం, ఫంగస్ పట్టిన నిమ్మకాయలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో మాంసం...

వేములవాడ డివిజన్ మాల మహానాడు కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ముఖ్యమైన పాయింట్స్:డివిజన్ కన్వీనర్‌గా బొల్లం దేవరాజు వేములవాడ టౌన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మాల మహానాడు సమావేశంలో వేములవాడ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ మాల మహానాడు, జిల్లా మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు తుంగ శివరాజు సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. డివిజన్ కన్వీనర్‌గా బొల్లం దేవరాజు, కో-కన్వీనర్‌గా నీరటి కిరణ్ కుమార్, యూత్ అధ్యక్షుడిగా రొండి మధుకర్, మీడియా ఇన్‌చార్జిగా సంటి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా తిక్కల నవీన్ కుమార్,...

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై.. వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ.. నిందితుడు అరెస్ట్

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలైన ఓ యువకుడు, అప్పులు తీర్చేందుకు బంధువైన వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును చోరీ చేశాడు. ఈ ఘటనలో కోనరావుపేట మండలం పల్లె నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్ణం వెంకటేష్ (29)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ నెల 18న కోదురుపాక గ్రామానికి చెందిన బొంగోని రాజవ్వ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మంకీ క్యాప్ ధరించి లోపలికి ప్రవేశించిన నిందితుడు, లైట్లు ఆపి ఆమెను బెదిరించి 10 గ్రాముల బంగారు గొలుసును...

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు ప్రత్యేక కౌన్సెలింగ్.

ముఖ్యమైన పాయింట్స్:మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే మీ ప్రాణాలకే కాదు.. ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం: ఎస్పీ మహేష్ బి.గీతే రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు,వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమనికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి,వాహనదారులతో మద్యం సేవించి వాహనాలు నడపబోమని,...

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్

ముఖ్యమైన పాయింట్స్:ఇప్పటికే అమృతకు ఆర్ధిక సాయం అందించిన కేంద్ర మంత్రినిత్యావసర సరుకులతోపాటు అమృతకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు ఇల్లు మంజూరైంది. అమృతకు దీన స్థితికి చలించిపోయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా ఇటీవల రూ.50 వేలు పంపారు. దీంతోపాటు...

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్

ముఖ్యమైన పాయింట్స్:ఇప్పటికే అమృతకు ఆర్ధిక సాయం అందించిన కేంద్ర మంత్రినిత్యావసర సరుకులతోపాటు అమృతకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు ఇల్లు మంజూరైంది. అమృతకు దీన స్థితికి చలించిపోయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా ఇటీవల రూ.50 వేలు పంపారు. దీంతోపాటు...

నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు

ముఖ్యమైన పాయింట్స్:మంజూరు పత్రం అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ ఓ నిరుపేద మహిళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేసి.. ఆదుకున్నారు.చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత బతుకుదెరువు నిమిత్తం దాదాపు 20 ఏండ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. నాలుగు ఏండ్ల క్రితం తన కొడుకు అనారోగ్య సమస్య పరిష్కారానికి వేములవాడకు వచ్చారు. సొంత ఇల్లు లేక అద్దె...

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరిరక్షణ వస్తువుల పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కార్యక్రమం కోనరావుపేట,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులను పంపిణీ చేశారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులను...

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ

ముఖ్యమైన పాయింట్స్:మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను నేటి సమాజానికి చాటిచెప్పే చిత్రం ‘ఫూలే’ -మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్,వీవీ న్యూస్ మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఫూలే’ (PHULE - 2025) సినిమా నేటి సమాజానికి ఆదర్శప్రాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రను, ఆయన...

అయ్యప్ప స్వాములకు షెడ్డు నిర్మాణం చేపట్టడం అభినందనీయం

ముఖ్యమైన పాయింట్స్:అయ్యప్ప స్వాముల అన్నదాన ప్రాంతంలో నూతన షెడ్డు నిర్మాణం చేపట్టిన సుజిత్ రావు జగిత్యాల,వీవీ న్యూస్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో స్వాములకు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఉపయోగపడే ప్రాంతంలో నూతన షెడ్డు నిర్మాణాన్ని టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నిర్మించారు. స్వాములకు అన్నదాన కార్యక్రమాల సమయంలో సౌకర్యవంతంగా ఉండేలా ఈ షెడ్డు నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తూ,స్వాములకు, భక్తులకు సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం...

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి' డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్

రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్య సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పీఎస్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (UPHC) ఆమె సందర్శించి వైద్య సేవలు, రిజిస్టర్లు, వివిధ రికార్డులను తనిఖీ చేశారు. అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ప్రయోజనాలపై తల్లిదండ్రులు, బాలికలకు విస్తృతంగా...

విలీన గ్రామాలకు ఉపాధి హామీ పథకం అమలు చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:లేదంటే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీ నుంచి తొలగించాలి: వ్యవసాయ కార్మిక సంఘం వేములవాడటౌన్,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి వర్తింపజేసి పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు.నాంపల్లి, తిప్పాపురం, కోనాయిపల్లి, శాత్రాజ్‌పల్లి, అయ్యోర్‌పల్లి తదితర విలీన గ్రామాలతో పాటు పట్టణంలోని నిరుద్యోగ యువత, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వ...

వేములవాడలో సిరిసిల్ల ది కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది

ముఖ్యమైన పాయింట్స్:రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ది సిరిసిల్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నూతన బ్యాంకు శాఖను ప్రారంభించారు.ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బంది ఆది శ్రీనివాస్‌కు స్వాగతం పలికారు. వేములవాడ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ఖాతాదారులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు నూతన శాఖ ఉపయోగపడనుంది.

వేములవాడ రాజన్న ఆలయ గోపురం తొలగింపుపై భగ్గుమన్న వివాదం.. బిజెపి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష

ముఖ్యమైన పాయింట్స్:బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లీ శ్రీధర్ అధ్యక్షతన ఒక్క రోజు నిరసన దీక్ష వేములవాడ రాజన్న గుడి గోపురం ద్వంసం చేసినందుకు గాను దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో విమాన గోపుర శిఖరం తొలగింపుపై స్థానికంగా తీవ్ర రాజకీయ, ఆధ్యాత్మిక చర్చ నెలకొంది. రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి,విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ విమాన గోపుర శిఖరాన్ని...

రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించే ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ముఖ్యమైన పాయింట్స్:రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది:మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మరియు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు,...

బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా రేగుల శ్రీకాంత్

ముఖ్యమైన పాయింట్స్:వేములవాడ,వీవీ న్యూస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే రేగుల శ్రీకాంత్‌కు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా మంగళవారం బాధ్యతలు అప్పగించింది.వేములవాడ పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిర్‌లో విద్యాభ్యాసం ప్రారంభించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఎదిగిన శ్రీకాంత్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. దుబాయ్‌లో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన, ఉద్యోగ జీవితాన్ని వదిలి సమాజ సేవ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా పనిచేయడంతో...